కంటెంట్‌కు వెళ్లండి

ప్రశ్నలు

హెల్త్ స్కాన్ గురించి ప్రశ్నలు, సమాధానాలు.

30 సెకన్ల హెల్త్ స్కాన్ ఎలా పనిచేస్తుందో, ఏం కొలుస్తుందో, ఏం కొలవదో తెలుసుకోండి. మీ గోప్యతను ఎలా కాపాడతామో చూడండి. ఇది ఆరోగ్య స్థితిపై బీటా అంచనా మాత్రమే, వైద్య పరికరం కాదు.

హెల్త్ స్కాన్ గురించి

Liv.Fit హెల్త్ స్కాన్ అంటే ఏమిటి?

ఇది Liv.Fit అందించే 30 సెకన్ల హెల్త్ స్కాన్. మీరు మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కెమెరా వైపు చూస్తే, మీ గుండె వేగం, శ్వాస రేటు, ఒత్తిడి స్థాయి, కోలుకునే స్థాయి వంటి ఆరోగ్య సూచికలను అంచనా వేస్తుంది. ఇది ఆరోగ్య స్థితిపై బీటా అంచనా మాత్రమే, వైద్య పరికరం కాదు.

ఈ స్కాన్ ఎవరి కోసం?

తమ ఆరోగ్య స్థితి గురించి కొద్దిసేపట్లో ఒక అంచనా పొందాలనుకునే 18 ఏళ్లు నిండిన వారి కోసం. ఇది పిల్లల కోసం కాదు. మీరు గర్భవతిగా ఉంటే, గుండె లయలో సమస్య ఉందని మీకు తెలిసి ఉంటే లేదా మీకు పేస్‌మేకర్ ఉంటే ఈ స్కాన్‌పై ఆధారపడకండి.

స్కాన్ చేయడానికి నాకేం కావాలి?

ముందు కెమెరా ఉన్న ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ కావాలి. అందులో తాజా బ్రౌజర్ లేదా Liv.Fit యాప్ ఉపయోగించవచ్చు. శరీరంపై ధరించే పరికరం లేదా మరే ఇతర పరికరం అవసరం లేదు.

యాప్ ఇన్‌స్టాల్ చేయాలా లేదా ఖాతా తెరవాలా?

లేదు. ఖాతా లేకుండానే మీ బ్రౌజర్‌లో scan.liv.fit తెరిచి స్కాన్ చేయవచ్చు. Liv.Fit ఖాతా తెరిస్తే మీ ఫలితాలను సేవ్ చేసుకుని, మీ ఇతర పరికరాల్లోనూ చూడవచ్చు.

ఏ భాషల్లో అందుబాటులో ఉంది?

స్కాన్ 12 భాషల్లో అందుబాటులో ఉంది: ఇంగ్లిష్, అరబిక్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, మలయాళం, తమిళం, పర్షియన్, ఫిలిపినో, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్.

స్కాన్ ఎలా పనిచేస్తుంది?

ఫోన్ కెమెరాతో నా గుండె వేగాన్ని ఎలా అంచనా వేస్తారు?

గుండె కొట్టుకున్న ప్రతిసారీ మీ ముఖ చర్మానికి కొంచెం ఎక్కువ రక్తం చేరుతుంది. దాంతో చర్మం రంగు చాలా స్వల్పంగా మారుతుంది. ఆ మార్పు కంటికి కనిపించదు కానీ కెమెరాలో కనిపిస్తుంది. స్కాన్ ఆ మార్పును 30 సెకన్ల పాటు గమనించి మీ నాడి వేగాన్ని లెక్కిస్తుంది.

స్కాన్‌కు ఎంత సమయం పడుతుంది?

సాధారణంగా 30 సెకన్లు పడుతుంది. మీరు 10, 45 లేదా 60 సెకన్ల వ్యవధిని కూడా ఎంచుకోవచ్చు. ఎక్కువసేపు స్కాన్ చేస్తే ఫలితాలు మరింత స్థిరంగా ఉంటాయి. మరికొన్ని సూచికలు కూడా లభిస్తాయి.

స్కాన్ సరిగా జరగాలంటే ఏం చేయాలి?

ముందుగా కూర్చొని ఒక నిమిషం విశ్రాంతి తీసుకోండి. ముఖమంతా సమంగా వెలుతురు పడేలా కిటికీ లేదా దీపం వైపు తిరగండి. కెమెరాను కళ్ల ఎత్తులో ఉంచండి. కదలకుండా, మాట్లాడకుండా ఉండండి. వీలైతే కళ్లద్దాలు తీసేయండి. నుదురు కప్పకుండా చూసుకోండి.

నా స్కాన్ మధ్యలో ఎందుకు ఆగింది? ఫలితం ఎందుకు కనిపించలేదు?

స్పష్టమైన సంకేతం అందనప్పుడు స్కాన్ ఆగుతుంది. ఉదాహరణకు, గదిలో వెలుతురు సరిపోకపోయినా, మీ ముఖం కెమెరా ఫ్రేమ్ బయటకు వెళ్లినా లేదా ఫోన్ కదులుతున్నా ఇలా జరగవచ్చు. పరిస్థితులు మెరుగవగానే స్కాన్ దానంతట అదే కొనసాగుతుంది. సంకేతం మరీ బలహీనంగా ఉంటే ఊహించి చెప్పకుండా, ఏ విలువనూ చూపదు.

అన్ని చర్మ ఛాయల వారికీ ఇది పనిచేస్తుందా?

అన్ని చర్మ ఛాయల వారికీ పనిచేసేలా దీన్ని రూపొందించాం. ఎవరికైనా ముఖమంతా తగినంత వెలుతురు సమంగా పడాలి. స్కాన్ ఇంకా బీటా దశలో ఉంది. వేర్వేరు చర్మ ఛాయలు, వయసులు, పరికరాల్లో దీని కచ్చితత్వంపై మా సొంత అధ్యయనాన్ని ఇంకా ప్రచురించలేదు. కాబట్టి ప్రతి ఫలితాన్నీ ఉజ్జాయింపు అంచనాగానే చూడండి.

స్కాన్ ఏం కొలుస్తుంది?

స్కాన్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు?

స్కాన్ మీ గుండె వేగం, శ్వాస రేటు, ఒత్తిడి స్థాయి, కోలుకునే స్థాయిని అంచనా వేస్తుంది. వీటిని కలిపి ఆరోగ్య స్కోరును ఇస్తుంది. మీరు ఎత్తు, బరువు, వయసు వంటి వివరాలు నమోదు చేస్తే, వాటితో శరీర నిర్మాణ సూచికలను, ప్రచురిత పద్ధతుల ఆధారంగా గుండె ఆరోగ్య అంచనాలను కూడా లెక్కిస్తుంది.

స్కాన్ రక్తపోటును కొలుస్తుందా?

లేదు. కెమెరా ఒక్కటే రక్తపోటును కొలవలేదు. మీరు మీ బీపీ కఫ్‌తో కొలిచిన రక్తపోటును నమోదు చేస్తే, అప్పటి నుంచి అది ఎంత మారి ఉండవచ్చో స్కాన్ బీటా అంచనాను చూపగలదు. మీ రక్తపోటు గురించి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా తప్పనిసరిగా కఫ్‌తో కొలవండి.

ఇది రక్తంలో చక్కెర, ఆక్సిజన్ లేదా కొలెస్ట్రాల్‌ను కొలుస్తుందా?

లేదు. స్కాన్ రక్తంలో చక్కెర, ఆక్సిజన్, కొలెస్ట్రాల్ స్థాయిలను గానీ, మరే ఇతర రక్త విలువను గానీ కొలవదు.

స్కాన్ ఎంత కచ్చితంగా పనిచేస్తుంది?

స్కాన్ బీటా దశలో ఉంది. దీని కచ్చితత్వాన్ని ఇంకా పరిశీలిస్తున్నాం కాబట్టి కచ్చితత్వంపై ఎలాంటి గణాంకాన్నీ ప్రచురించడం లేదు. ఫలితాలు ఆరోగ్య స్థితిపై ఉజ్జాయింపు అంచనాలు మాత్రమే. ఏదైనా విలువ అసాధారణంగా అనిపిస్తే, ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. మంచి వెలుతురులో కదలకుండా కూర్చుని మళ్లీ స్కాన్ చేయండి.

స్కాన్ ఒక వైద్య పరికరమా?

కాదు. ఇది ఆరోగ్య స్థితిపై బీటా అంచనా మాత్రమే, వైద్య పరికరం కాదు. ఇది ఏ ఆరోగ్య సమస్యనూ నిర్ధారించదు, చికిత్స చేయదు, నివారించదు. వైద్యుడికి లేదా వైద్య పరికరానికి ప్రత్యామ్నాయం కాదు.

ఫలితం చూసి ఆందోళనగా అనిపిస్తే ఏం చేయాలి?

ఒక్క ఫలితంతో పెద్దగా ఏమీ చెప్పలేం. విశ్రాంతి తీసుకుని, మంచి వెలుతురులో మళ్లీ స్కాన్ చేయండి. మీకు ఒంట్లో బాగోలేకపోతే లేదా ఫలితం మళ్లీ అసాధారణంగానే ఉంటే వైద్యుడిని సంప్రదించండి. అత్యవసర పరిస్థితిలో మీ స్థానిక అత్యవసర సేవల నంబర్‌కు కాల్ చేయండి.

గోప్యత

నా వీడియోను రికార్డ్ చేస్తారా లేదా నిల్వ చేస్తారా?

లేదు. స్కాన్‌కు సంబంధించిన లెక్కలన్నీ మీ పరికరంలోనే జరుగుతాయి. మీ వీడియోను, మీ ముఖ చిత్రాలను Liv.Fitకు గానీ మరెవరికీ గానీ ఎప్పుడూ పంపరు. వాటిని ఎప్పుడూ నిల్వ చేయరు.

నా పరికరం నుంచి బయటకు వెళ్లే సమాచారం ఏమిటి?

మీరు ఎంచుకుంటే తప్ప ఏ సమాచారమూ బయటకు వెళ్లదు. ఫలితాలు మీ బ్రౌజర్ లేదా యాప్‌లోనే ఉంటాయి. ‘సేవ్’ నొక్కితే ఆ స్కాన్‌లోని సంఖ్యలు మీ Liv.Fit ఖాతాలో సేవ్ అవుతాయి. ‘ఈ స్కాన్‌ను పంపండి’ నొక్కితే కచ్చితత్వాన్ని పరిశీలించేందుకు ఆ ఒక్క స్కాన్‌లోని సంఖ్యలు, నాడి తరంగం మా బృందానికి వెళ్తాయి. వీడియో ఎప్పుడూ పంపబడదు.

స్కాన్ నా ముఖాన్ని గుర్తుపడుతుందా లేదా నా ముఖం ఆధారంగా నేనెవరో గుర్తిస్తుందా?

లేదు. ఇది మీరెవరో గుర్తించదు, మీ ముఖాన్ని మరో ముఖంతో పోల్చదు. మీ ముఖానికి సంబంధించిన నమూనాను ఉంచుకోదు. స్కాన్ జరుగుతున్నప్పుడు మీ నుదురు, బుగ్గలు ఎక్కడ ఉన్నాయో మాత్రమే గమనిస్తుంది.

నా డేటాను అమ్ముతారా లేదా ప్రకటనలకు వాడతారా?

లేదు. మేము మీ వ్యక్తిగత డేటాను అమ్మము. మీ ఆరోగ్య డేటాను ప్రకటనల కోసం వాడము.

నా డేటాను ఎలా తొలగించాలి?

మీ పరికరంలో ఉంచుకున్న స్కాన్‌లను తొలగించడానికి scan.liv.fitలో ‘ప్రొఫైల్’ తెరవండి. Liv.Fit ఖాతాను, అందులో సేవ్ చేసిన డేటాను తొలగించడానికి యాప్‌లో ‘ప్రొఫైల్’, ఆపై ‘గోప్యత’, తర్వాత ‘నా ఖాతాను తొలగించు’ ఎంచుకోండి. లేదా app.liv.fit/delete-account తెరవండి.

ప్లాన్లు, చెల్లింపులు

స్కాన్ ఉచితమా?

మీరు ఉచితంగా ప్రారంభించవచ్చు. స్కాన్ ప్యాకేజీని కొనుగోలు చేస్తే ప్రతి నెలా మరిన్ని స్కాన్లు చేయవచ్చు. కొనడానికి ముందే ధర ఎప్పుడూ కనిపిస్తుంది.

స్కాన్ ప్యాకేజీని ఎలా రద్దు చేయాలి?

iPhone యాప్‌లో కొన్న ప్యాకేజీని మీ Apple ID సబ్‌స్క్రిప్షన్ సెట్టింగ్‌లలో రద్దు చేయండి. Android యాప్‌లో కొన్న ప్యాకేజీని Google Playలో ‘చెల్లింపులు, సబ్‌స్క్రిప్షన్‌లు’ కింద రద్దు చేయండి. తదుపరి రుసుము పడకుండా ఉండాలంటే గడువు ముగియడానికి కనీసం 24 గంటల ముందే రద్దు చేయండి. మీరు చెల్లించిన వ్యవధి ముగిసే వరకు ప్యాకేజీని వాడుకోవచ్చు.

నేను చెల్లించిన డబ్బు తిరిగి పొందవచ్చా?

iPhone లేదా Android యాప్‌లో చేసిన కొనుగోళ్లకు రీఫండ్‌లను Apple లేదా Google తమ రీఫండ్ విధానాల ప్రకారం నిర్వహిస్తాయి. వివరాలకు మా సేవా నిబంధనల్లోని 9వ విభాగాన్ని చూడండి.

ఇతర సేవలు

నేను Liv.Fit ద్వారా డాక్టర్‌ను సంప్రదించవచ్చా?

అవును, మీ దేశంలో ఈ సేవ అందుబాటులో ఉంటే Liv.Fit యాప్‌లో డాక్టర్‌ను ఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చు. యాప్‌లో మందులు, ఫార్మసీ సేవలు, ల్యాబ్ పరీక్షలు, హెల్త్ చెకప్‌లు కూడా ఉన్నాయి. బీటా వెర్షన్‌లోని ఫేస్ స్కాన్ మీ ఆరోగ్య స్థితిపై ఒక అంచనా మాత్రమే ఇస్తుంది. ఇది వైద్య పరికరం కాదు, డాక్టర్‌కు ప్రత్యామ్నాయమూ కాదు.

నా ఫలితాలను నా వైద్యుడికి చూపించవచ్చా?

అవును. స్కాన్ ఫలితాలతో ప్రింట్ చేసుకోగల నివేదికను రూపొందించవచ్చు. దాన్ని మీ వైద్యుడికి చూపించవచ్చు లేదా పంపవచ్చు. ఈ ఫలితాలు ఆరోగ్య స్థితిపై బీటా అంచనాలు మాత్రమే అని గుర్తుంచుకోండి.

సహాయ బృందాన్ని ఎలా సంప్రదించాలి?

[email protected]కు ఇమెయిల్ పంపండి లేదా ఈ వెబ్‌సైట్‌లోని సంప్రదింపు ఫారమ్‌ను ఉపయోగించండి.

ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?

మాకు రాయండి. మా బృందంలో ఒకరు సమాధానం ఇస్తారు.